ఆదివారం 23 ఫిబ్రవరి 2020
ఇరాక్‌ బాధితులను హైదరాబాద్‌కు రప్పించిన రాష్ట్ర ప్రభుత్వం

ఇరాక్‌ బాధితులను హైదరాబాద్‌కు రప్పించిన రాష్ట్ర ప్రభుత్వం

Feb 15, 2020 , 09:40:07
PRINT
ఇరాక్‌ బాధితులను హైదరాబాద్‌కు రప్పించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌: ఇరాక్‌లో చిక్కుకున్న 16 మంది తెలంగాణ వాసులను రాష్ట్ర ప్రభుత్వం నగరానికి తీసుకువచ్చింది. నకిలీ ఏజెంట్ల మోసంతో మూడేళ్లుగా ఇరాక్‌లో చిక్కుకున్న బాధితులు.. తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు విన్నవించుకున్నారు. వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు, సొంత ప్రాంతాలకు తిరిగి రాలేకపోతున్నామని వీడియోల ద్వారా బాధితులు తమ ఆవేదనను వెల్లడించారు. వారి ఆవేదనను విన్న మంత్రి కేటీర్‌.. బాధితులను రాష్ర్టానికి తీసుకువచ్చేందుకు తక్షణమే చర్యలు తీసులకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు.. ఇరాక్‌ అధికారులతో సంప్రదింపులు జరిపి బాధితులను రాష్ర్టానికి రప్పించారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు 16 మంది బాధితులు శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకున్నారు. వారందరినీ సొంత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించింది. ఈ సందర్భంగా బాధితులు తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. logo