బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 02:40:53

ఆరున్నరేండ్లలో 26.06 కోట్లు

ఆరున్నరేండ్లలో 26.06 కోట్లు

  • కులాంతర వివాహాలు చేసుకున్న 4,957 జంటలకు లబ్ధి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సామాజిక అసమానతలను రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నది. ఆరున్నరేండ్ల వ్యవధిలో 4,957 జంటలకు రూ. 26.06 కోట్లు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు రూ. 50 వేల చొప్పున అందించిన ప్రభుత్వం ఆ మొత్తాన్ని భారీగా పెంచింది. 2019-20 నుంచి 2.50 లక్షల చొప్పున అందిస్తున్నది.  ఆ మొత్తాన్ని కులాంతర వివాహం చేసుకున్న జంట పేరిట మూడేండ్ల కాలపరిమితితో కూడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా ఇస్తున్నది.