సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 15:06:40

రైతుల భూములకు రక్షణ కవచం నూతన రెవెన్యూ చట్టం

రైతుల భూములకు రక్షణ కవచం నూతన రెవెన్యూ చట్టం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రెవెన్యూ చట్టం రైతుల భూములకు రక్షణ కవచంగా ఉంటుందని పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ..పెద్దపల్లి, భూపాలపల్లి జడ్పీ చైర్మన్లు పుట్ట మధు, జక్కు శ్రీహర్షిని రాకేష్ ల ఆధ్వర్యంలో రైతులతో కాటారం మండలంలోని మద్దులపల్లి నుంచి ఎర్రగుంటపల్లి వరకు 500కు పైగా ట్రాక్టర్లతో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్తేజపరిచారు. కాగా, వేలాదిగా రైతులు పాల్గొని ఆనందోత్సాహాల మధ్య సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. logo