శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 02:36:14

సచివాలయం కట్టేది ప్రజల కోసమే

సచివాలయం కట్టేది ప్రజల కోసమే

  • విశ్వాసాల కంటే చట్టం గొప్పది
  • ప్రార్థనా స్థలాల కేసులో హైకోర్టు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సచివాలయం కట్టేది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, ప్రజాప్రయోజనం కోసమని హైకోర్టు స్పష్టంచేసింది. సచివాలయంలో మసీదు నిర్మాణం విషయంలో ప్రభుత్వం చట్టప్రకారం వ్యవహరించదని ఎందుకు భావిస్తున్నారని పిటిషనర్లను ప్రశ్నించింది. సచివాలయంలో మసీదు, ఆలయం నిర్మాణాలపై దాఖలైన పలు వ్యాజ్యాలపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సచివాలయంలో ప్రార్థనా మందిరాలను ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే హామీ ఇచ్చారని అడ్వకేట్‌ జనరల్‌ పేర్కొన్నారు. ప్రజాప్రయోజనం కోసం కట్టే సచివాలయానికి స్థల సేకరణ అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ధర్మాసనం పేర్కొన్నది. విశ్వాసాల కంటే చట్టం గొప్పదని, ఎక్కడికో వెళ్లి ప్రార్థించాల్సిన అవసరం లేదని, మనసులో ధ్యానించుకున్నా సరిపోతుందని వ్యాఖ్యానించింది. విచారణను అక్టోబర్‌ 8కి వాయిదా వేసింది.


logo