ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 20:24:38

రెండో దశ మెట్రోపై సీఎస్‌ సమావేశం

రెండో దశ మెట్రోపై సీఎస్‌ సమావేశం

హైదరాబాద్‌ : హెచ్‌ఎంఆర్‌ఎల్‌, ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ బోర్డులతో అధికారులు సోమవారం సమావేశం నిర్వహించారు. బీఆర్‌కేభవన్‌లో సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు పలు విభాగాల ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి, జల మండలి ఎండీ దానకిశోర్‌ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్రో రైల్‌ రెండో దశ పనులు, 18 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ బస్‌ వే ప్రాజెక్టులపై సీఎస్‌ చర్చించారు. మెట్రో రెండో దశ, ఎలివేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టంపై అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా సీఎస్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా మెట్రో రైల్‌ రెండో దశ, ఎలివేటెడ్‌ బస్‌ రాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌పై ప్రతినిధులు ప్రజంటేషన్‌ ఇచ్చారు. మెట్రో రైల్‌ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యత ఎయిర్‌కామ్‌ సంస్థకు ఇవ్వాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇందుకు ఐదేళ్లకాలానికి రూ.6.94 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. నగర సమగ్ర ట్రాఫిక్‌, రవాణా ప్రణాళికను ప్రభుత్వానికి పంపాలని సీఎస్‌ సూచించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.