మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 02:15:40

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఒకటినే వేతనం

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఒకటినే వేతనం

  • మంత్రి కే తారకరామారావు ఆదేశం l ఉత్తర్వులు జారీచేసిన మున్సిపల్‌శాఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వాలని అన్ని మున్సిపాలిటీలను ఆదేశించింది. శుక్రవారం ఉమ్మడి మెదక్‌జిల్లాలోని మున్సిపాలిటీలపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆలస్యంగా వేతనాలు ఇస్తున్న విషయం ఆయన దృ ష్టికి వచ్చింది. ఇకపై మిగతా ఉద్యోగుల మాదిరే వారికి కూడా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పురపాలకశాఖ జీహెచ్‌ఎంసీ మినహా అన్ని మున్సిపాలిటీలకు మార్గదర్శకా లు జారీచేసింది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల హాజరును 24వ తేదీ వరకే గణించాలని సూచించిం ది. వేతనాల చెల్లింపునకు సంబంధించిన ప్రక్రియలన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ 30లోగా ముగించాలని స్పష్టంచేసింది. ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని.. గరిష్ఠంగా 5వ తేదీ దాటకూడదని ఆదేశించింది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ రూ.12 వేలు వేతనం ఇవ్వాలని, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ క్రమంతప్పకుండా చెల్లించాలని స్పష్టంచేసింది. చెల్లింపులు ఆలస్యమైతే సంబంధిత అధికారుపై చర్యలు తప్పవని హెచ్చరించింది. పారిశుద్ధ్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించాలని ఆదేశించింది. కేటీఆర్‌ ఆదేశం మేరకు మార్గదర్శకాలు జారీచేసింది. logo