మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 16:37:30

నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లోనూ అదే జోరు..

నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లోనూ అదే జోరు..

కరీంనగర్/నల్లగొండ : సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. కొత్త చట్టంతో భూ సమస్యలు తీరినట్లేనని రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు తీస్తూ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ట్రాక్టక్ల ర్యాలీని ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ ప్రారంభించారు. హుజూరాబాద్ లో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.  

కరీంనగర్ జిల్లాలో..


నల్లగొండ జిల్లాలో..logo