గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 01:37:52

ఎవరికైనా కరోనా ఇంజెక్షన్ల విక్రయం అబద్ధం

ఎవరికైనా కరోనా ఇంజెక్షన్ల విక్రయం అబద్ధం

కరోనా పాజిటివ్‌ వచ్చినవారు టెస్ట్‌ రిపోర్ట్‌, డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌, ఆధార్‌ కార్డు, ఐపీ కార్డు వివరాలు తీసుకొని వస్తే హైదరాబాద్‌ కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని హెటెరో డ్రగ్స్‌కు చెందిన డిస్టిబ్యూటర్‌ అజిస్టా ఇండ్రస్ట్రీస్‌లో రూ.32,400కు కొవిడ్‌-19 మందులు అందజేస్తున్నారు. అవసరమైనవారు ఈ నంబర్లలో సంప్రదించాలి. ప్రస్తుతం సోషల్‌మీడియాలో  వైరల్‌ అవుతున్న పోస్టు ఇది.

ఈ మెస్సేజ్‌ నిజమేననుకొని అజిస్టా ఇండస్ట్రీస్‌కు సోమవారం కొందరు వచ్చారు. మెస్సేజ్‌లో ఉన్న ఫోన్‌ నంబర్లకు కంపెనీకి సంబంధం లేదని అజిస్టా ఇండస్ట్రీస్‌ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా మందు కోవిఫర్‌ 100 ఎంఎల్‌ ఇంజెక్షన్‌ను విక్రయిస్తున్నది  వాస్తవమేనని, కొవిడ్‌ నెట్‌వర్క్‌లోని దవాఖానల వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్‌, రోగి ఆరోగ్య పరిస్థితిని వివరించినవారికే విచారణ జరిపి అందజేస్తున్నామని తెలిపారు. ఔషధాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం 18001034696 టోల్‌ ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలని స్పష్టంచేశారు.logo