సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 12:51:21

సైనికుల త్యాగాలు చిరస్మరణీయం: అల్లోల

సైనికుల త్యాగాలు చిరస్మరణీయం: అల్లోల

నిర్మల్‌: గల్వాన్‌ లోయలో ప్రాణాలర్పించిన సైనికులను చూసి దేశం గర్విస్తున్నదని, వారి త్యాగాలు మరువలేనివని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో ఆయన భారత్‌, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులు అర్పించారు. గల్వాన్‌ ఘర్షణల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.  కల్నల్‌ సంతోష్‌ బాబుకు కుంటుంబానికి రూ.5 కోట్లు, ఆయన భార్యకు గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని చెప్పారు. 

అంతకుముందు నిర్మల్‌ నియోజకర్గంలోని నర్సాపూర్‌ మండలంలో పర్యటించారు. మండలంలోని అంజనీ గ్రామానికి రైతు జాధవ్‌ శ్యామ్‌ ఇటీవల మృతిచెందారు. దీంతో ఆయన కుటుంబానికి రూ.5 లక్షల రైతుబందు చెక్కును అందించారు. ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన కళ్యాణిని ఆయన అభినందించారు. 


logo