శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 18, 2021 , 17:37:27

పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధుల పాత్ర భేష్

పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధుల పాత్ర భేష్

నిజామాబాద్ : పల్లెల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న కార్యక్రమం పల్లె ప్రగతి. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లాస్థాయి వరకు ప్రజా ప్రతినిధులు నిర్వహించిన పాత్ర ఎంతో అభినందనీయమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం  జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అధ్యక్షతన నిర్వహించగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు. గ్రామాలను పరిశుభ్రంగా మార్చారన్నారు. ఇదే స్ఫూర్తితో ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉంటే వాటిని కూడా పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఎటువంటి సమస్యలు లేకుండా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తున్నామని తెలిపారు. ధరణి పోర్టల్‌పై ప్రజా ప్రతినిధులు రైతులకు ఆయా విషయాలపై అవగాహన కల్పించి వారు దరఖాస్తు చేసుకునే విధంగా చూడాలని కోరారు.


గ్రామాలు మండలాల్లో రోడ్ల డ్యామేజ్ పై సభ్యులు మరమ్మతులకు నిధులు కోరగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కనీసం 20 నుంచి 30 కోట్ల రూపాయలు రహదారులకు వాటి మరమ్మతులకు మంజూరు చేశామన్నారు. గత సంవత్సరం ఉపాధి హామీ పథకంలో 95 కోట్ల రూపాయలు ఖర్చు కాగా ఈ సంవత్సరం 120 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే రూ.113 కోట్లు ఖర్చు చేశామని ఇందుకు గాను సంబంధిత అధికారులందరినీ అభినందిస్తున్నానని మంత్రి తెలిపారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, శాసన మండలి సభ్యులు వీవీజీ గౌడ్, జిల్లా పరిషత్ సీఈవో గోవిందు, జెడ్పీటీసీలు, ఎంపీపలు, అధికారులు పాల్గొన్నారు. 

ఇవి కూడా చదవండి..

కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం, అగ్నిగుండం

అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్‌లో చేరికలు

దారుణం.. కొడుక్కు నిప్పంటించిన తండ్రి 

హాజరు విషయంలో ఒత్తిడి ఉండదు: మంత్రి సబితా

VIDEOS

logo