బుధవారం 03 జూన్ 2020
Telangana - May 12, 2020 , 16:39:59

కరోనా కట్టడిలో వైద్యులు, సిబ్బంది పాత్ర వెలకట్టలేనిది

కరోనా కట్టడిలో వైద్యులు, సిబ్బంది పాత్ర వెలకట్టలేనిది

మహబూబ్‌నగర్‌ : కరోనా మహమ్మారిని అరికట్టడంలో  అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న వైద్య సిబ్బంది సేవలు ఎంతో గొప్పవని ఎక్సైజ్ శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన వేడుకలకు మంత్రి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా IMA ఆధ్వర్యంలో నర్సులకు, దవాఖాన సిబ్బందికి (కొవిడ్- 19) కరోనా వైరస్ ప్రొటెక్షన్ కిట్స్ ను అందజేశారు.  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం అంతా ఎంతో కృషి చేసిందన్నారు. ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న వారి సేవలను కొనియాడారు.

 


logo