గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 01:34:46

చారిత్రక కట్టడాల పునరుద్ధరణ గర్వకారణం

చారిత్రక కట్టడాల పునరుద్ధరణ గర్వకారణం
  • ప్రేమావతి, తారామతి టూంబ్స్‌ను ప్రారంభించిన అమెరికా రాయబారి

మెహిదీపట్నం: రాష్ట్రంలోని చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, సుందరీకరణ పను ల్లో తాము కూడా భాగస్వాములవడం గర్వంగా ఉన్నదని అమెరికా రాయబారి కెన్నెత్‌ ఐ జస్టర్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన అమెరికా ఆర్థిక సహకారంతో, ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన గోల్కొండ టూంబ్స్‌ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇటీవల మరమ్మత్తులు పూర్తయిన ప్రేమావతి, తారామతి టూంబ్స్‌ను ప్రారంభించారు. వివిధ దేశాల్లో చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించడానికి అమెరికా ఆర్థికసాయం అందజేస్తున్నదని ఆయన చెప్పారు. గోల్కొండ టూంబ్స్‌లో మ్యాపింగ్‌, డా క్యుమెంటేషన్‌ కోసం 2014లో లక్షా ఒక వెయ్యి  డాలర్ల  నిధులు ఇచ్చామన్నారు. ఇప్పుడు ప్రేమావతి, తారామతి టూంబ్స్‌ పునరుద్ధరణ, సుందరీకరణకు  లక్షా మూ డువేల డాలర్లను కేటాయించామన్నారు. 


ఏరో స్ట్రక్చర్స్‌ను సందర్శించిన కెన్నత్‌ జస్టర్‌ 

ఆదిబట్లలోని టాటా లాఖిడ్‌ మార్టిన్‌ ఏరో స్ట్రక్చర్స్‌ ఫెసిలిటీ సెంటర్‌ను కెన్నత్‌ జస్టర్‌ సందర్శించారు. పదేండ్ల క్రితం ఏర్పాటైన ఈ సెంటర్‌ అమెరికా, భారత్‌ మధ్య రక్షణ రంగ సహకారానికి నిదర్శనమన్నారు.  కా ర్యక్రమంలో అమెరికా కాన్సుల్‌ జనరల్‌ (హైదరాబాద్‌) జోయెల్‌ రీఫ్‌ మన్‌, పురాతత్వశాఖ ఈడీ నారాయణ పాల్గొన్నారు.


logo
>>>>>>