మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 17, 2021 , 01:20:28

రికవరీ రేటు 97.99 శాతం

రికవరీ రేటు 97.99 శాతం

హైదరాబాద్‌, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.99 శాతానికి చేరుకోగా, జాతీయస్థాయిలో 96.5 శాతంగా నమోదైంది. వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉన్నది. పాజిటివిటీ రేటు అతి తక్కువగా నమోదవుతున్నది. శుక్రవారం రాష్ట్రంలో 28,953 టెస్టులు నిర్వహించగా, 249 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 0.86గా రికార్డయ్యిందని శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 54, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 18, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 17, మంచిర్యాలలో 11, కరీంనగర్‌, రంగారెడ్డిలలో 10 చొప్పున కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 74 లక్షలు దాటింది.

వివరాలు శుక్రవారం మొత్తం 

పాజిటివ్‌ కేసులు 249 2,91,367

డిశ్చార్జీ అయినవారు 417 2,85,519

మరణాలు 1 1,575

చికిత్స పొందుతున్నవారు - 4,273

VIDEOS

తాజావార్తలు


logo