మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 00:44:13

నీటికుక్కల జాడకు అన్వేషణ

నీటికుక్కల జాడకు అన్వేషణ
  • వేంపేట వాగు, చెరువులో గాలింపు

జగిత్యాల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట పెద్ద వాగు, పెద్దచెరువు ప్రాంతాన్ని జిల్లా అటవీ అధికారి శనివారం రాత్రి పరిశీలించారు. మూడురోజుల క్రితం వేంపేట వాగులో, తర్వాత చెరువులో నీటి జంతువులను గ్రామస్థులు గుర్తించి, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేశారు. అత్యంత అరుదైన, అం తరించిపోయే జీవుల్లో  ఉన్న నీటి కుక్కలు (స్మూత్‌ ఇండియన్‌ ఆటర్‌) వేంపేట వాగు, చెరువుల్లో కనిపించడం, దీనిపై ‘నమస్తే తెలంగాణ’లో శనివారం కథనం ప్రచురితం కావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యా రు. మెట్‌పల్లి రేంజర్‌ రాజేశ్వర్‌, డిప్యూటీ రేంజర్‌ హరిప్రియ ఉదయం నుంచే నీటి కుక్కల ఉనికి కోసం ప్రయత్నించారు. జిల్లా అటవీ అధికారి రవిప్రసాద్‌ శనివారం రాత్రి వేంపేటకు చేరుకొని వేంపేటవాగును, చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. 


logo
>>>>>>