బుధవారం 03 జూన్ 2020
Telangana - May 08, 2020 , 14:41:27

ప్రాజెక్ట్ ల పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి వేముల

ప్రాజెక్ట్ ల పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి వేముల

హైదరాబాద్ : కోటి ఎకరాలకు సాగునీరు అందిచడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  అన్నారు. ఎస్సారెస్పీ నుంచి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు గోదావరి నీళ్లను లిఫ్ట్ ల ద్వారా తీసుకురావడానికి ఉద్దేశించబడి ప్యాకేజీ 20,ప్యాకేజీ 21 పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో  సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ లక్ష్యం కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ప్రతి సంవత్సరం కాళేశ్వరం నీళ్లతో ఎస్సారెస్పీ ని నింపడం ఖాయమన్నారు. అందులో భాగంగా ప్యాకేజీ 20,21 పనులు పూర్తయితే ఆర్మూర్ నియోజకవర్గంలో 7వేలు, బాల్కొండ నియోజకవర్గంలో 80వేల ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1లక్ష 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్యాకేజీ 21-B మెట్పల్లి పైపులైన్ పనుల్లో వేగం పెంచి ఈ వానాకాలం సీజన్ కు ఆర్మూర్, జక్రాన్ పల్లి, వేల్పూర్ మండలాల్లోని 20 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సిద్ధం కావాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు పైపులైన్ పనులకు ఆటంకం కలిగించ వద్దని, పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


logo