ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 01:29:29

కోటి టన్నుల ధాన్యం సేకరణ

కోటి టన్నుల ధాన్యం సేకరణ

  • ముగిసిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడా ది 1.12 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలుచేసి రికార్డు సృష్టించారు. వ్యవసా య ఉత్పత్తుల కొనుగోళ్లు ముగిశాయి. ఇందులో వానకాలంలో 47 లక్షల టన్ను లు, యాసంగిలో 65 లక్షల టన్నులు సేకరించారు. గతేడాది యా సంగిలో 38 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. అంటే గతేడాదితో పోల్చితే 27 లక్షల టన్నులు అధి కం. రాష్ట్రవ్యాప్తంగా 6,408 కేంద్రాల ద్వారా 9.68 లక్షల మంది రైతుల నుంచి దాదాపు రూ.12 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటికే రూ.11 వేల కోట్లు రైతుఖాతాల్లో జమచేశారు. మిగిలినవిమూడు రోజుల్లో జమచేయనున్నారు. 2014- 15లో వానకాలం, యాసంగి కలిపి 24 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ఈ సారి ఏకంగా 1.12 కోట్ల టన్నులకు చేరింది. ఏకంగా 367 శాతం పెరుగడం విశేషం.  

ఈ ఘనత సీఎం కేసీఆర్‌దే: మారెడ్డి

రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్ల వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌, సాగునీటి ప్రాజెక్టుల వల్లే 1.12 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ధాన్యం సేకరణ పూర్తి వెనుక సమిష్టి కృషి ఉన్నదన్నారు.  


logo