సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 14:52:23

నాటుకోడి @500

నాటుకోడి @500

న్యూ ఢిల్లీ :  కరోనా కారణంగా అన్ని వస్తువులకు ధరలు పెరుగుతుండగా తాజాగా నాటుకోడి ధర కొండెక్కింది. హైదరాబాద్‌లో నాటుకోడి కేజీకి రూ.500 పలుకుతోంది. కరోనా సమయంలో నాటుకోడి తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని జనాలు ఎగబడి కొనుగోళ్లు చేస్తుండడంతో ఇప్పుడు ఈ కోడికి డిమాండ్‌ ఏర్పడింది. 

బాయిలర్‌ స్కిన్‌లెస్ చికెన్‌ గతంలో రూ. 150 నుంచి 170 ఉండగా ప్రస్తుతం రూ. 250 నుంచి 270 వరకు విక్రయిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కోళ్ల దిగుమతి తగ్గడంతో వ్యాపారులు ధరలు విపరీతంగా పెంచేశారు. కరోనా వైరస్‌ వ్యాపార రంగాలను మాత్రమే కాకుండా మెజారిటీ జనం జీవనశైలిపై కూడా ప్రభావితం చూపింది. నగరంలో ప్రతిరోజు సుమారుగా ఒక కోటికి పైగా గుడ్లు, 20 క్వింటాళ్ల నిమ్మకాయలు అమ్ముడవుతున్నాయట. వీటిలో విటమిన్‌ సీ ఎక్కువగా ఉంటుండంతోనే వీటి విక్రయాలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. 

కరోనాను ఎదుర్కునేందుకు రోగనిరోధక శక్తి అవసరమని వైద్యులు సూచిస్తుండడంతో, ప్రజలు నాణ్యమైన ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇతర మాంసాల కంటే మటన్‌, నాటుకోడికి ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది. వీటి సరఫరాలో కొరత ఏర్పడి, డిమాండ్‌ పెరగడం వల్ల ధరలు అమాంతం పెరిగాయి. మటన్‌ హైదరాబాద్‌లో కేజీ రూ.1000కి విక్రయిస్తుండగా జీహెచ్‌ఎంసీ అధికారుల దాడుల అనంతరం రూ.700లకు విక్రయిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo