బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 17:24:19

పేదలకు చేయూతనందించాలి : ప్రభుత్వ విప్‌ గాంధీ

పేదలకు చేయూతనందించాలి : ప్రభుత్వ విప్‌ గాంధీ

హైదరాబాద్‌ : పేదలకు చేతనైన చేయూతను అందించేందుకు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు మరింత మందికి సహాయం లభించే అవకాశం ఉంటుందన్నారు. హోప్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కొండా విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి డివిజన్‌కు చెందిన పేద మహిళలకు కుట్టు మిషన్లు, చందానగర్‌ డివిజన్‌కు చెందిన చక్రవర్తికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని గాంధీ చేతుల మీదుగా గురువారం పంపిణీ చేశారు.

ఈ  సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. సమాజానికి తోచిన సేవ చేయాలనే దృక్పథంతో హోప్‌ ఫౌండేషన్‌ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. నిజమైన పేదలకు చేయూతను అందించటం, వారికి స్వయం ఉపాధికి తోడ్పాటును అందిస్తుండటం గొప్ప విషయమన్నారు. దీనిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పురుషోత్తం యాదవ్‌, చాంద్‌పాషా, రామేశ్వరమ్మ, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.