e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home News వృద్ధురాలికి అండగా నిలిచిన పోలీసులు

వృద్ధురాలికి అండగా నిలిచిన పోలీసులు

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్‌ పోలీసులు మరోసారి తమ సేవానిరతిని చాటుకున్నారు. నగదు, విలువైన కాగితాలు ఉన్న సంచిన పోగొట్టుకున్న వృద్ధురాలికి బాసటగా నిలిచారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఎలా ఉండాలో ఆచరణలో చూపించారు. వివరాల్లోకి వెళ్తే..జడ్చర్ల మండలం ఆలూరుకు చెందిన ఆశమ్మ అనే వృద్ధురాలు పని నిమిత్తం మంగళవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. పని ముగించుకున్నాక అబ్దుల్ ఖాదర్ దర్గా వద్దకు వస్తూ అక్కడ తన సంచిని పోగొట్టుకున్నది. చుట్టుపక్కల వెతికినా దొరకపోవడంతో సమీపంలోనే ఉన్న పోలీసు ఠాణాకు వెళ్లి తన సంచిలో విలువైన పత్రాలు, డబ్బులు ఉన్నాయన్న విషయం చెప్పి ఫిర్యాదు చేసింది. ఎస్.హెచ్.ఓ. రాజేశ్వర్ ఆదేశాల మేరకు.. బ్లూ కోట్స్‌ పోలీసు కానిస్టేబుళ్లు శ్రీశైలం, కేశవులు వెంటనే స్పందించారు.


దర్గా దగ్గరకు వెళ్లి సమీపంలోని ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి సంచిని గుర్తించి ఆశమ్మకు అప్పగించారు. అందులో ఉండాల్సిన ఇరవై వేల రూపాయల నగదు, తన ఇంటి డాక్యుమెంట్లు, సెల్ ఫోన్, ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయని ముసలవ్వ ఆనందం వ్యక్తం చేసింది. సకాలంలో స్పందించి సాయమందించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

దారుణం : ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ పై తాను తాగి..

రామప్పను సందర్శించిన మంత్రులు, పురావస్తు శాఖ అధికారులు

జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత

మహబూబాబాద్‌ జిల్లాలో 120 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana