శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 15:13:31

పోలీసులు ఉన్నది ప్రజల కోసమే

పోలీసులు ఉన్నది ప్రజల కోసమే

మంచిర్యాల : పోలీసులు ఉన్నది ప్రజల కోసమే అని రామగుండం కమిషనర్ సత్యనారాయణ అన్నారు. మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం బెజ్జాలలో ఏర్పాటు చేసిన పోలీసులు మీకోసం కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరైన  అక్కడి గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సంధర్బంగా అయన మాట్లడుతూ.. పోలీసులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు అన్నారు. పోలీసులు అంటే మీ  సేవకులని పేర్కొన్నారు. వారిని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు.

వారు కూడా మన కుటుంబ సభ్యులే అని భావించి, వారిని ఆశ్రయించవచ్చన్నారు. ఎమ్మెల్యే చిన్నయ్య కూడా సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. అనంతరం మాదారం ఎస్‌ఐ మానస ఆధ్వర్యంలో ఆదివాసుల సహాయార్థం 300 మందికి నిత్యావసర సరుకులు, చెప్పులు, బ్లాంకెట్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ రెహమాన్‌, తాండూర్ సీఐ  బాబురావు పాల్గొన్నారు.