జీహెచ్ఎంసీపై గులాబీ జెండానే

- రోడ్‌షోలకు ప్రజల నుంచి ఆదరణే రుజువు
- రేపు ఎల్బీస్టేడియంలో సీఎం భారీ బహిరంగసభ
- అభివృద్ధిపై ఆలోచనలు పంచుకోనున్న కేసీఆర్
- శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు
- టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
- ఎల్బీ స్టేడియంలో బహిరంగసభ ఏర్పాట్ల పరిశీలన
ప్రజల కష్టాలను శాశ్వతంగా దూరంచేసేందుకు సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. అందులోభాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలో డిసెంబర్ నుంచి మంచినీటి బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేదనే విధాన నిర్ణయం తీసుకున్నారు. దీనిని బాజాప్తా అమలుచేయనున్నారు. రేపు టీఆర్ఎస్ బహిరంగ సభ ద్వారా హైదరాబాద్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి తన ఆలోచనలను ప్రజలతో పంచుకోనున్నారు.
- మంత్రి కేటీఆర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ రోడ్‌షోలకు విశేష ఆదరణ వస్తున్నదని, ప్రజల ఆశీర్వాదబలంతో ఈసారి కూడా జీహెచ్ఎంసీపై గులాబీజెండా ఎగరవేయడం ఖాయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. పేద, దిగువ. మధ్యతరగతివర్గాలకు తాగునీటి బిల్లులను ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దుచేసిన నేపథ్యంలో తాము ఎక్కడికెళ్లినా ప్రజలు హర్షం ప్రకటిస్తున్నారని చెప్పారు. గురువారం మంత్రి కేటీఆర్.. ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే టీఆర్ఎస్ బహిరంగసభ ఏర్పాట్ల పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, వారిపై ప్రభుత్వం కఠినాతికఠినంగా వ్యవహరిస్తుందని ఇప్పటికే సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారని అన్నారు. ఏపార్టీ వారైనా, చివరకు టీఆర్ఎస్ వారైనాసరే ఉపేక్షించబోమని కరాఖండిగా పేర్కొన్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ గడచిన ఐదేండ్లకాలంలో ఏం చేసింది. భవిష్యత్‌లో ఏమి చేయబోతుందో ప్రజలకు మ్యానిఫెస్టో రూపంలో స్పష్టంచేశామని పేర్కొన్నారు. పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నారని.. అందులోభాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా విధాన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. శనివారం ఎల్బీస్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నామని, సాయంత్రం 4గంటలకు సభ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిపై తన ఆలోచనలను ప్రజలతో పంచుకుంటారని తెలిపారు. ఈ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని, సీఎం కేసీఆర్ ఆలోచనలను ప్రత్యక్షంగా వినేందుకు ఆసక్తిని చూపుతున్నారని తన రోడ్‌షోల ద్వారా స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. కేటీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ప్రభుత్వ చీఫ్‌విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వవిప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సభాప్రాంగణం.. పార్కింగ్ స్థలాలు, వీవీఐపీ, వీఐపీ, ప్రెస్ గ్యాలరీ తదితర అంశాలపై సీపీ అంజనీకుమార్‌కు పలు సూచనలు చేశారు. సభా ప్రాంగణంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేయాలని నిర్వాహకులను ఆదేశించారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు