బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 13:46:36

దుబ్బాకలోనూ గెలిచేది గులాబీ జెండానే

దుబ్బాకలోనూ గెలిచేది గులాబీ జెండానే

 నిర్మల్ : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్  భారీ విజయం సాధిస్తుందని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించిన సందర్భంగా సోమవారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట చైర్మన్, కౌన్సిలర్లు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఈశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ పక్షానే ఉన్నారడానికి నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కనీసం పోటీ కూడా ఇవ్వకుండా డిపాజిట్ లు కోల్పోయాయని అన్నారు. వచ్చే నెలలో జరుగనున్న దుబ్బాకలో టీఆర్ఎస్  భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో నిర్మల్ పట్టణ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


logo