మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 17:38:35

హరితహారంలో జిల్లా అధికారుల పనితీరు భేష్ : ప్రియాంక వర్గీస్

హరితహారంలో జిల్లా అధికారుల పనితీరు భేష్ : ప్రియాంక వర్గీస్

నల్లగొండ : హరితహారంలో జిల్లా అధికారుల పనితీరు బాగుందని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ(హరితహారం) ప్రియాంక వర్గీస్ అన్నారు. జిల్లాలో ఎన్ హెచ్ 65 రోడ్డుకు కిరువైపులా హరితహరంలో భాగంగా నాటిన మొక్కలను ఓఎస్డీ పరిశీలించారు. అలాగే చిట్యాల మండలం గుండ్రంపల్లి, చిట్యాల మున్సిపాలిటీ, నార్కట్ పల్లి, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి మండలాల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను సైతం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్, ఎన్.హెచ్. అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు.

గత సంవత్సరం అటవీ శాఖ 28,000 మొక్కలు నాటినట్లు అధికారులు వివరించారు. జిల్లా యంత్రాంగం హరితహారంలో బాగా పని చేశారని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. గుండ్రంపల్లి, వెలిమినేడు వద్ద హైవే వెంబడి ఉన్న ఇండ్ల ముందు కూడా వరుసగా ఉండేలా మొక్కలు నాటాలని సూచించారు. నాటిన మొక్కలు నరికి వేయాలంటే నేషనల్ హైవే అథారిటీ అధికారుల అనుమతి కాకుండా.. డీఎఫ్వో నుంచి ఎన్వోసీని తప్పని సరిగా తీసుకోవాలని అధికారులకు సూచించారు.logo