బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 19:19:04

ప్రతిపక్షాల తీరు మారాలి : మంత్రి తలసాని

ప్రతిపక్షాల తీరు మారాలి : మంత్రి తలసాని

హైదరాబాద్ :  ఉస్మానియా దవాఖానపై ప్రతి పక్షాలు బాధ్యతగా మాట్లాడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆధునిక హంగులతో కొత్త దవాఖానను సీఎం కేసీఆర్ నిర్మిస్తామంటే ప్రతిపక్షాలు కోర్టుకెళ్లి అడ్డుకున్నాయని విమర్శించారు. అప్పుడు అడ్డుకొని ఇప్పుడు  కన్నీరు కార్చడమేంటని ప్రశ్నించారు. కాగా, ఉస్మానియా ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకొని మార్గం చూపించాలని మంత్రి కోరారు.

భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. అప్పుడు ఉస్మానియా ఇప్పుడు కొత్త సచివాలయాన్ని అడ్డుకుంటున్నాయని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ నేతల తీరు మరీ విడ్డూరంగా ఉందన్నారు. వారిది హైదరాబాద్ లో ఒక డ్రామా..ఢిల్లీలో మరో డ్రామా అని ఎద్దేవా చేశారు. అలాగే ప్రభుత్వ నియంత్రణలోనే ప్రైవేటు దవాఖానలు ఉంటాయని స్పష్టం చేశారు. logo