శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 01:38:44

టీఆర్‌ఎస్‌ ఓటమి తట్టుకోలేక గుండెపోటుతో పార్టీ నేత మృతి

టీఆర్‌ఎస్‌ ఓటమి తట్టుకోలేక గుండెపోటుతో పార్టీ నేత మృతి

కాల్వశ్రీరాంపూర్‌: దుబ్బాక ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి ఓటమిని తట్టుకోలేక ఆ పార్టీ నేత గుండెపోటుతో మరణిం చారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండ లకేంద్రంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు పులి సత్య నారాయణరెడ్డి (61) స్థానిక బస్టాండ్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల తో కలిసి దుబ్బాక ఓట్ల లెక్కింపును టీవీలో చూస్తున్నారు. బీజేపీ గెలుపొం దినట్టు ప్రకటించిన వెంటనే.. అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. పార్టీ నేతలు దవాఖానకు తరలి స్తుండగానే మార్గమధ్యలో మృతిచెందారు.