బుధవారం 03 జూన్ 2020
Telangana - May 22, 2020 , 11:55:28

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఒట్టి బూటకం

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఒట్టి బూటకం

జనగామ: పాలకుర్తి లోని తన క్యాంపు కార్యాలయంలో ముస్లింలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ బూటక మన్నారు. 

కేంద్రానికి కుదవ పడ్డట్టు ఉంటేనే సాయం చేస్తామన్న రీతిలో బీజేపీ వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఇలాంటి సహాయం మాకు అక్కర్లేదని సీఎం కేసీఆర్ తోసిపుచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం అన్నివిధాలా కృషి చేస్తుందని పేర్కొన్నారు. 7వేల కోట్ల రూపాయలు రైతుబంధు కోసం, రూ.500 కోట్లు ఉపాధి హామీ కోసం విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే లబ్ధి దారులకు కల్యాణ లక్మి చెక్కులు పంపిణీ చేశారు.


logo