ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 18:28:44

డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

సిద్దిపేట :డబుల్ బెడ్ రూం ఇండ్ల  నిర్మాణం వేగిరం చేయాలి. ఇప్పటికే పూర్తి అయిన ఇండ్లతో పాటు, నిర్మాణాల పరంగా తుది దశకు చేరుకున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చేయాలని కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గజ్వేల్ ఐవోసీలో గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డితో కలిసి గజ్వేల్ నియోజక వర్గ పరిధిలోని ఎనిమిది మండలాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ ప్రగతిపై ఇంజినీరింగ్, విద్యుత్, రెవెన్యూ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.


 గజ్వేల్ నియోజకవర్గానికి ప్రభుత్వం 4,009 ఇండ్లను కేటాయించగా ఇప్పటివరకు 2,908 ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. 898 ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. మిగతా ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రగతిలో ఉన్న ఇండ్ల నిర్మాణం వేగంగా జరిగేలా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇండ్ల నిర్మాణం పూర్తి అయిన సైట్ లలో తాగునీటి సౌకర్యంతో పాటు రోడ్లు, విద్యుత్, మురుగు కాల్వల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఇండ్ల పురోగతి, మౌలిక సదుపాయాలు కల్పన అంశాలను సంబంధిత తహశీల్దార్ లు పరిశీలించి.. గడా ప్రత్యేక అధికారికి ఈ నెల 13 వ తేదీ లోగా నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు.


logo