సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 18, 2020 , 17:09:35

వడివడిగా కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులు

వడివడిగా కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులు

ఖమ్మం : ఇంటింటికి తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పనులు వడి వడిగా కొనసాగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ప్రభుత్వం రూ.230 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు.

మిషన్ భగీరథ పనులకు గాను తన అభ్యర్థన మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కొవిడ్ పరిస్థితుల్లో కూడా రూ.67.41 కోట్ల రూపాయల విలువైన చెక్కులను ఎల్ అండ్ టీ ప్రతినిధులకు అందజేశారు. ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికి పరిశుభ్రమైన తాగునీటిని అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, పబ్లిక్ హెల్త్ అధికారి రంజిత్ కుమార్ తదితరులు ఉన్నారు.logo