బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 01:57:16

కరోనా సోకిందని..కన్నతల్లినే కాదన్నారు

కరోనా సోకిందని..కన్నతల్లినే కాదన్నారు

  • ఊరు బయట రాత్రంతా వృద్ధురాలి నరక యాతన

వరంగల్‌ సబర్బన్‌: కరోనా సోకిందని కన్నతల్లినే కాదనుకున్నారు ఆ ప్రబుద్ధులు. ఊరు బయట వదిలేయడంతో రాత్రం తా ఆ తల్లి నరకయాతన అనుభవించింది. ఈ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలంలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. పీచర గ్రామానికి చెందిన మల్లయ్య, లచ్చమ్మ దంపతులకు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. ఉన్న భూమిని కొడుకులకు పంచి ఇచ్చా రు. తండ్రి 18 ఏండ్ల క్రితమే చనిపోయాడు. ఆ తర్వాత తల్లిని నలుగురు కొడుకులు తలా 15 రోజులు చూసుకునేవారు. ఈ క్రమంలో రెండో కొడుకు బాలరాజు ఇంట్లో ఇద్దరికి కరోనా సోకింది. వాళ్లింట్లోనే ఉంటున్న లచ్చమ్మకు కూడా పాజిటివ్‌ వచ్చింది. హోం ఐసొలేషన్‌లో ఉండి వైద్యుల సూచనల మేర కు మందులు వాడుతున్నది. శనివారానికి మూడో కుమారుడు అశోక్‌ వంతు వచ్చింది. కరోనా సోకినందున తల్లిని ఇంట్లోకి తీసుకువెళ్లేందుకు అశోక్‌ నిరాకరించి ఊరు బయట ఉన్న తన పొలం వద్ద నాలుగు కర్రలు పాతి, గుడ్డలు కప్పి అందులో తల్లిని ఉంచాడు. లచ్చమ్మ రాత్రంతా దోమలు, చలిలోనే చీక ట్లో గడిపింది. విషయం పోలీసులకు తెలిసి అదే రాత్రి కొడుకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. పోలీసులు మందలించడంతో అశోక్‌, అతని భార్య వెళ్లి భోజనం పెట్టారు. ఆదివారం పోలీసులు కొడుకులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి చిన్న కొడుకు సుధాకర్‌ ఇంట్లో ఉండేలా, మూడో కొడుకు అశో క్‌ సపర్యలు చేసేలా ఒప్పించి లచ్చమ్మను ఇంటికి చేర్చారు. 


logo