మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 16:55:10

మంత్రి కొప్పులకు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కొప్పులకు శుభాకాంక్షల వెల్లువ

హైదరాబాద్‌ : రాష్ట్ర షెడ్యూల్‌ కులాల అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను శనివారం పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని క్యాంప్‌ కార్యాలయంలో మంత్రిని మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి నదీమ్ అహ్మద్, ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మైనారిటీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి షఫీవుల్లా, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణా, జాయింట్ డైరెక్టర్ హన్మంతు నాయక్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతివెస్లీ, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కరుణాకర్, జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్, దివ్యాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ శైలజ, అడిషనల్ ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, మాల మహానాడు అధ్యక్షుడు తలమళ్ల హుస్సేన్ తదితరులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.logo