మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 16:48:24

ఎన్ఎస్పీ కాలువ కట్టను సుందరంగా తీర్చిదిద్దుతాం

ఎన్ఎస్పీ కాలువ కట్టను సుందరంగా తీర్చిదిద్దుతాం

ఖమ్మం : ఖమ్మం నగర ప్రజల ఆరోగ్య రీత్యా 23వ డివిజన్ వేణుగోపాల్ నగర్ లోని ఎన్ఎస్పీ కాలువ కట్టను సుందరీకరిస్తాం. వాకింగ్ ట్రాక్, ఇరు వైపుల ఫెన్సింగ్, గ్రీనరీ, లైటింగ్‌తో పాటు మినీ పార్క్ మాదిరిగా తీర్చి దిద్దనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఎన్‌ఎస్పీ కాలువ వెంబడి ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను మంత్రి పరిశీలించారు. రూ. 2.30 కోట్లతో ఎన్‌ఎస్పీ కాలువకు రెండు వైపులా దాదాపు ఐదు కిలోమీటర్లు మేర స్థానికంగా నివాసం ఉంటున్న పేదల ఆరోగ్యం కోసమే ప్రత్యేకంగా దీన్ని సుందరీకరిస్తున్నామని తెలిపారు. పిల్లలు ఆడుకోవడానికి, వాకింగ్‌తో పాటు ఆహ్లాదం కల్పిస్తామనన్నారు. కాలువ వెంబడి కొనసాగుతున్న పనుల వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ను ఆదేశించారు.logo