ఆదివారం 31 మే 2020
Telangana - May 12, 2020 , 13:23:02

స్వగ్రామం చేరిన ఎన్నారై మృత దేహం

స్వగ్రామం చేరిన ఎన్నారై మృత దేహం

హైదరాబాద్‌ : పొట్టకూటి కోసం దేశం కాని దేశం వలస వెళ్లి  మృత్యువాత పడిన వ్యక్తి మృత దేహాన్ని బహ్రెయిన్ లోని  టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో స్వగ్రామానికి చేర్చారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్  గ్రామానికి చెందిన ఎడ్ల గంగరాజం మూడేండ్ల క్రితం  బతుకు దెరువు కోసం బహ్రెయిన్ దేశంలో ని ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాడు.  దురదృష్టవశాత్తు 14 ఏప్రిల్ 2020 తేదీన గుండె పోటుతో మృతి చెందాడు.  గంగారాజాంకు భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే ప్రపంచమంతా లాక్ డౌన్ పాటిస్తుండటంతో  విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ఇబ్బందిగా మారింది.

దీంతో బహ్రెయిన్ లోని టీఆర్ఎస్  ఎన్నారై సెల్, తోటి స్నేహితులు ఎన్నారై శాఖకు సమాచారం అందించి  గంగరాజం పనిచేస్తున్న  కంపెనీతో మాట్లాడారు. కంపెనీ సహకారంతో మృత దేహాన్ని ఎమిరేట్స్ కార్గో ప్లైయిట్ లో బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ కు తరలించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి వారి స్వగ్రామం రాఘవపేట్ వరకు టీఅర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్సుసౌకర్యం కల్పించారు.  


logo