బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 14:39:25

యాదాద్రిలో భక్తుల సందడి

యాదాద్రిలో భక్తుల సందడి

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. పుష్కరిణి, కల్యాణకట్ట, ప్రసాద విక్రయశాల, తిరువీధుల్లో భక్తులతో సందడిగా మారాయి. ఉదయమే స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామి వారి నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. అష్తోత్తర పూజలు, సుదర్శన నరసింహా హోమం ఘనంగా జరిగాయి. స్వామి వారి నిత్య కళ్యాణం శాస్త్రోక్తంగా చేపట్టారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పరిమితి సంఖ్య లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.