శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 18:50:17

కాళేశ్వరంలో భక్తుల సందడి

కాళేశ్వరంలో భక్తుల సందడి

జయశంకర్‌ భూపాలపల్లి :  జిల్లాలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయం శనివారం సందడిగా మారింది. కార్తీకమాసం శనివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. హైదరాబద్‌, వరంగల్‌, భూపాలపల్లి, కరీంనగర్‌ నుంచేగాక మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుంచి సుమారు 20వేల మంది భక్తులు తరలివచ్చారు. ముందుగా త్రివేణీ సంగమం గోదావరిలో స్నానాలు చేసి కార్తీక దీపాలు వదిలి, సైకత లింగలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో కాలసర్ప దోష పూజలు చేశారు. నవగ్రాహల వద్ద శని పూజలు, అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి అభిషేకాలు చేశారు. ఆలయంలోని తులసి చెట్టు వద్ద పూజలు చేసి, ఉసరి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు.