శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 04:41:44

కొత్త సచివాలయం కట్టాల్సిందే

కొత్త సచివాలయం కట్టాల్సిందే

  • తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రజలు, ఉద్యోగుల అవసరాల దృష్ట్యా కొత్త సచివాలయాన్ని కట్టాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి చెప్పారు. పాత సచివాలయం పరిపాలనకు అంతగా అనువుగా లేదని శనివారం మీడియాకు వెల్లడించారు. మంత్రులు ఒకచోట, ప్రభుత్వశాఖల కార్యదర్శులు, ఇతర ఉద్యోగుల కార్యాలయాలు వేరొకచోట ఉండటం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. పాత సచివాలయంలో ఉద్యోగులు, ప్రజలకు అందుబాటులో వాష్‌రూమ్‌లు, మూత్రశాలలు కూడా సరిగాలేవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతించాలని పేర్కొన్నారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్‌గౌడ్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.


logo