మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 19:20:07

నూతన రెవెన్యూ చ‌ట్టం చారిత్రాత్మకం : మంత్రి ఎర్రబెల్లి

నూతన రెవెన్యూ చ‌ట్టం చారిత్రాత్మకం : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : నూతన రెవెన్యూ చ‌ట్టం చారిత్రాత్మకమని, సీఎం కేసీఆర్  రైతు బాంధ‌వుడని  పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్నిశాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ గొప్ప సంస్కరణ వాది అన్నారు. ఆయ‌న చేప‌ట్టిన అనేక సంస్కరణలో రెవెన్యూ చ‌ట్టం చారిత్రాత్మకమైందన్నారు. నిరుపేద ప్రజ‌ల‌కు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.

ఇప్పటికే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేప‌ట్టారని వెల్లడించారు. దీంతో అవినీతి తగ్గిపోయి భూ సమస్యలు స‌మ‌సిపోతాయన్నారు.  రైతాంగానికి  సీఎం కేసీఆర్ చేస్తున్నంత‌గా ఇప్పటి వ‌ర‌కూ ఎవ‌రూ చేయ‌లేదని పేర్కొన్నారు. ఇక కొత్తి రెవెన్యూ చ‌ట్టంతో పంచాయ‌తీల బాధ్యత మ‌రింత పెరిగిందన్నారు. స‌ర్పంచ్ లు, కార్యదర్శులు నిబద్దతో పని చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం మా శాఖ స‌హా మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.


logo