శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 12, 2020 , 00:05:39

మార్కెట్లోకి సరికొత్త పోలో, వెంటో

మార్కెట్లోకి సరికొత్త పోలో, వెంటో

న్యూఢిల్లీ, మే 11: ఫోక్స్‌వాగన్‌ దేశీయ మార్కెట్లోకి సరికొత్త పోలో, వెంటో కార్లను సోమవారం ప్రవేశపెట్టింది. ‘టీఎస్‌ఐ ఎడిషన్‌'గా బీఎస్‌ 6 శ్రేణిలో వచ్చిన ఈ మోడళ్లలో పోలో ధర రూ.7.89 లక్షలుగా, వెంటో రూ.10.99 లక్షలుగా ఉన్నది. 1-లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ సామర్థ్యంతో ఉన్న ఈ వాహనాల్లో పోలో మైలేజీ లీటర్‌కు 18.24 కిలోమీటర్లుగా, వెంటో మైలేజీ 17.69 కిలోమీటర్లుగా ఉంటుందని ఫోక్స్‌వాగన్‌ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.


logo