తెలుగు ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్‌కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె కోసం ఇప్పటికీ దర్శక నిర్మాతలు వేచి చూస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కాజల్ డేట్స్ కోసం ఎగబడుతున్నారు నిర్మాతలు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది చందమామ. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తాననే కమిట్మెంట్తోనే గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నానని.. అప్పటికీ ఇప్పటికీ తన కెరీర్లో మార్పులేం లేవని చెప్పుకొచ్చింది కాజల్. అయితే పెళ్లి తర్వాత తనకు తాను సెల్ఫ్ ప్రమోషన్ ఇచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
అప్పుడు కుర్ర హీరోలతో ఎక్కువగా నటించిన కాజల్.. పెళ్లి తర్వాత సీనియర్ హీరోలపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు కుర్ర హీరోలతో నటించడానికి ఈమెకు వయసు సరిపోదు.. ఫిజిక్ ఒప్పుకోదు. అందుకే సీనియర్ హీరోలతో సరిపెట్టుకుంటుంది. తాజాగా చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తుంది కాజల్. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. మరోవైపు కమల్ హాసన్‌తోనూ ‘ఇండియన్ 2’లో నటిస్తుంది. అయితే ఈ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది. ఇదే విషయం కన్ఫర్మ్ చేసింది కాజల్ అగర్వాల్.
ఇదిలా ఉంటే తాజాగా మరో సీనియర్ హీరోతో కూడా రొమాన్స్‌కు రెడీ అయిపోయింది ఈ భామ. అక్కినేని నాగార్జునతో తొలిసారి రొమాన్స్ చేయబోతుంది ఈమె. ఇదివరకే నాగార్జున తనయుడు నాగ చైతన్యతో నటించింది కాజల్. పదేళ్ల కింద ‘దడ’ సినిమాలో ఈయనతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు చైతూ తండ్రి నాగార్జునతో నటించబోతుంది కాజల్.
ఈ మధ్యే యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కొత్త సినిమాను మొదలుపెట్టాడు నాగార్జున. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 22 నుంచి మొదలైంది. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా సెట్ నిర్మించారు.
ఈ సినిమాకు పాన్ ఇండియన్ అప్పీల్ కోసం అన్ని భాషల నుంచి నటులను తీసుకుంటున్నాడు ప్రవీణ్. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా రాబోతుంది. ఇందులో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్, మిస్ యూనివర్స్ పోటీల్లో మెరిసిన గుల్‌పనాగ్ నటిస్తోంది. ఇక నాగార్జునకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. కాజల్ ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఖరారు చేసింది.
నాగార్జునతో తొలిసారి నటించడంపై ఎగ్జైట్ ఫీల్ అవుతుంది కాజల్. మార్చి 31 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న షూటింగ్లో జాయిన్ కానుంది ఈ భామ. నారాయణ దాస్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నాడు. ఏదేమైనా పెళ్లి తర్వాత సీనియర్ హీరోలకు తనను తాను పరిమితి చేసుకుంటుంది కాజల్ అగర్వాల్.