శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 18:05:00

నిరాడంబరంగా వినాయక నిమజ్జనాలు..పాల్గొన్న మంత్రి

నిరాడంబరంగా వినాయక నిమజ్జనాలు..పాల్గొన్న మంత్రి

వరంగల్ అర్బన్ : క‌రోనా కార‌ణంగా ఈసారి వినాయ‌క చవితి ఉత్సవాలు, నిమ‌జ్జనం క‌ళ త‌ప్పిన‌ట్లయింది. కరోనాతో మాత్రం ప్రజలు జాగ్రత్తగా ఉండాల‌ని, పంచాయ‌తీరాజ్, శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. హన్మకొండలోని ప‌ద్మాక్షమ్మ గుట్ట వద్ద వినాయ‌క నిమజ్జన ప్రదేశాలను, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్కర్ తో క‌లిసి మంత్రి ప‌రిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిజానికి ప్రభుత్వం వినాయ‌క ఉత్సవాలను ఈ సారి జ‌రుపుకోవ‌ద్దని ఆదేశించింద‌న్నారు. అయితే, కొంద‌రు ఔత్సాహికులు కొన్ని చోట్ల ప‌రిమితంగా చిన్న చిన్న వినాయ‌క విగ్రహాలను ప్రతిష్టించార‌న్నారు. వాటిని నిమజ్జనం చేసుకోవ‌డానికి ప‌రిమితులు, ష‌ర‌తుల‌తో కూడిన విధంగా కొంత వెసులుబాటు ఉంద‌న్నారు. 

దీన్ని దృష్టి లో పెట్టుకుని ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అర్ధ రాత్రి వరకు నిమిజ్జనం చేయొద్దన్నారు. నిమజ్జన కార్యక్రమాలు వైభ‌వంగా కాకుండా, భౌతిక‌ దూరం పాటిస్తూ నిరాడంబరంగా జ‌రుపుకోవాల‌ని మంత్రి సూచించారు. 
logo