సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 22, 2020 , 01:55:43

మామిడిపల్లిలో జీవాల అభివృద్ధి కేంద్రం

మామిడిపల్లిలో జీవాల అభివృద్ధి కేంద్రం

  • లోక్‌సభలో ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మామిడిపల్లిలో జీవాల అభివృద్ధి కేంద్రం (తెలంగాణ స్టేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ లైవ్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌) ఏర్పాటుకు నిర్ణయించినట్టు కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి సంజీవ్‌కుమార్‌ సోమవారం తెలిపారు. ఇందుకు రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కింద రూ.18.50 కోట్లు ఇవ్వాలని నిర్ణయించా మన్నారు. లోక్‌సభలో ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.  

యూరియా విడుదల చేయండి: రంజిత్‌రెడ్డి

గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో ఈ ఏడాది 37 శాతం వ్యవసాయ సాగు పెరిగిందని, ఇందుకు అవసరమైన యూరియాను తెలంగాణకు విడుదల చేయాలని ఎంపీ రంజిత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. సోమవారం లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడుతూ  రాష్ట్రంలో వ్యవసాయ సాగు భారీగా పెరిగిందని తెలిపారు. 


logo