ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 18:33:05

మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు : డీజీపీ మహేందర్ రెడ్డి

మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు : డీజీపీ మహేందర్ రెడ్డి

వరంగల్ : మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు అని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఏటూరు నాగారం సబ్ డివిజన్ లోని వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో ములుగు, భూపాలపల్లి కి చెందిన పోలీస్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ  మాట్లాడుతూ మావోయిస్టులు మళ్లీ తెలంగాణలో ప్రవేశించి హింసాత్మక చర్యలకు పూనుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో తెలంగాణ పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టు ఆగడాలను అడ్డుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అయిన హరి భూషణ్, దామోదర్ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అమాయక గిరిజనులను బలిపశువులుగా చేస్తున్నారని, మావోయిస్టు లకు ఎవరూ కూడా సహకరించకుండా ఉండాలని హెచ్చరించారు. 

తెలంగాణలో ఉండే డాక్టర్లు ,ఇంజనీర్లను, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథక రచన తో తిరిగి మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టాలని మావోయిస్టులు చేసే ప్రయత్నాలను తెలంగాణ పోలీస్ శాఖ సమర్థంగా తిప్పి కొడుతుందని తెలియజేశారు. నక్సలిజం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే శరవేగంగా అభివృద్ధి ,సంక్షేమ రంగా ల్లో దూసుకుపోతుందని  ఆయన పేర్కొన్నారు.


logo