శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 12:31:19

సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం

సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం

వనపర్తి  : జిల్లా పర్యటనలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సురవరం ప్రతాపరెడ్డి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ తొలి దశ ఉద్యమ నాయకుడు సురవరం ప్రతాప్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

ఆయన స్ఫూర్తితోనే మలి దశ ఉద్యమం సాగిందన్నారు. భవిష్యత్ తరాలకు ఆయన జీవితం ఆదర్శమని పేర్కొన్నారు. 400 పేజీలతో ఆయన జీవిత చరిత్ర సంపుటి ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది సురవరం మీద అధ్యయనం చేసేందుకు ఈ సంకలనం ఉపయోగపడుతుందన్నారు. వనపర్తి శాసనసభ్యుడిగా సురవరం కొద్ది కాలమే పని చేసినా వారి స్ఫూర్థిని భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.

దీనికి సహకరిస్తున్నసాహితీవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. సెప్టెంబర్ 9న కాంస్య విగ్రహ ఆవిష్కరణకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలోని కవులు, కళాకారులు, సాహితీవేత్తలను ఆహ్వానిస్తామన్నారు. కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం,  జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, ప్రజాప్రనిధులు, అధికారులు పాల్గొన్నారు.logo