శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Nov 28, 2020 , 01:22:49

దేశంలోనే అతిపెద్ద టీ-వర్క్‌

దేశంలోనే అతిపెద్ద టీ-వర్క్‌

  • ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ 
  • సీఐఐ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో అతిపెద్ద ప్రొటోటైప్‌ సదుపాయమైన టీ-వర్క్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యే క కార్యదర్శి జయేశ్‌రంజన్‌ అన్నారు. శుక్రవారం సీఐఐ ఆధ్వర్యంలో వర్చువల్‌ లో నిర్వహించిన ఎడ్యు సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. టీ-వర్క్స్‌ ఉన్నత విద్యాసంస్థల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి సహాయపడుతుందన్నారు. ఉన్నత విద్యారంగంలో సామాజిక అంశాలపై పరిశోధనల కోసం సహకరించడానికి జేఎన్టీయూహెచ్‌, బ్రిటిష్‌ కౌన్సిల్‌తో కలిసి టీ-వర్క్స్‌ పనిచేస్తుందన్నారు. అటల్‌ ఇన్నోవేషన్‌ మిష న్‌, నీతి ఆయోగ్‌ డైరెక్టర్‌ రామన్‌ మాట్లాడుతూ.. ఐఐటీలు, నాన్‌ ఐఐటీల మధ్య అంతరాన్ని తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వీ వెంకటరమణ, టాస్క్‌ సీఈవో ఎం శ్రీకాంత్‌సిన్హా, ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి పాల్గొన్నారు.

VIDEOS

logo