e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home తెలంగాణ నదిని ఎత్తిపోస్తే.. కాళేశ్వరం

నదిని ఎత్తిపోస్తే.. కాళేశ్వరం

నదిని ఎత్తిపోస్తే.. కాళేశ్వరం

మనిషి, మిషన్‌ కలయికల శక్తి..
అసాధ్యం నుంచి సుసాధ్యం దాకా..
ఎక్కడా చూడని భారీ పంపులు..
ఎన్నడూ కానరాని బాహుబలి మోటర్లు..
సమయంతో పోటీ పడి నిర్మాణం..
నదినే ఎత్తిపోసే మహా జలయజ్ఞం..
ఆ ప్రాంతంలో సాధ్యమవుతుందా?
ఆ పరిమాణంలో కట్టగలరా?
సాంకేతికంగా సంభవమేనా?
అన్న సందేహాలు
కానీ, ఒక అద్భుతం కండ్లముందు ఆవిష్కృతం
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు

  • కాళేశ్వరం ప్రాజెక్టుపై
    డిస్కవరీ చానల్‌ చేసిన వ్యాఖ్యలివి
    హైదరాబాద్‌, జూన్‌ 19 (నమస్తే తెలంగాణ): నీటిని ఒక వైపు నుంచి ఇంకోవైపుకు మళ్లించటం కామనే. ఏకంగా నదినే ఎత్తిపోస్తే అది మిరాకిల్‌. అది సాధ్యమా? అనేది ఒక ప్రశ్న. దాన్ని నిజం చేస్తే.. వండర్‌ అనాల్సిందే. అంతటి అద్భుతం మన కాళేశ్వరం ప్రాజెక్టు. దాని గొప్పతనం మనకు మాత్రమే తెలుసు. మరో ఐదు రోజుల్లో దాని ఘనత విశ్వవ్యాప్తం కానున్నది.. ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తయ్యే దాకా వేలాది మంది కార్మికులు, ఇంజినీర్లు, ప్రభుత్వ అధికారులు, పాలకులు పడ్డ శ్రమ ఏపాటితో ప్రపంచానికి తెలియనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కలలు కని సుసాధ్యం చేసిన కాళేశ్వర ప్రాజెక్టు వివరాలను ప్రముఖ అంతర్జాతీయ చానల్‌ డిస్కవరీ.. ‘లిఫ్టింగ్‌ ఏ రివర్‌’ పేరుతో ఈనెల 25న ప్రసారం చేయబోతున్నది. డిస్కవరీ చానల్‌, డిస్కవరీ హెచ్‌డీలో ఈ వీడియో ప్రసారం కానున్నది. ఇటీవలే విడుదల చేసిన 30 సెకన్ల ప్రోమో ఉత్సుకత పెంచేలా ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టుగా పేరుగడించిన ఈ ప్రాజెక్టు వీడియో ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తున్నది. మనిషి, మిషన్‌ కలయికల శక్తి ఇదనీ చెప్తున్న వీడియోలో కాళేశ్వర ప్రాజెక్టు అందాలను చూపించారు. ఈ నెల 27న మధ్యా హ్నం 2:32 గంటలకు పునఃప్రసారం చేయనున్నట్టు సంస్థ తెలిపింది. డిస్కవరీ సైన్స్‌లో 28న రాత్రి 9 గంటలకు, తిరిగి 29న సాయంత్రం 4:50 గంటలకు, డిస్కవరీ టర్బోలో 29న రాత్రి 9:50 గంటలకు, తిరిగి 30న సాయంత్రం 4:50 గంటలకు ప్రసారం కానున్నదని తెలిపింది. డిస్కవరీకి చెందిన ఓటీటీ చానల్‌ ‘డీ+’లో 25 నుంచి అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ 2017లో ప్రారంభించామని, సుమారు రెండేం డ్లు శ్రమించినట్టు తెలిపింది. ప్రాజెక్టు ట్రయల్స్‌తోపాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ ప్రాజెక్టు ప్రారంభోత్సవం వరకు తమ ప్రయాణం సాగిందని వివరించింది. ఈ డాక్యుమెంటరీని ఢిల్లీకి చెందిన పల్స్‌ మీడియా ప్రొడక్షన్‌ నేతృత్వంలో రాజేంద్ర శ్రీవాత్సవ తెరకెక్కించారు. ఇంగ్లిష్‌తోపాటు 6 భారతీయ భాషల్లో ప్రసారం చేయనున్నారు.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నదిని ఎత్తిపోస్తే.. కాళేశ్వరం
నదిని ఎత్తిపోస్తే.. కాళేశ్వరం
నదిని ఎత్తిపోస్తే.. కాళేశ్వరం

ట్రెండింగ్‌

Advertisement