మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 09, 2020 , 01:24:51

కల్యాణలక్ష్మికి 50% అదనంగా నిధులు

కల్యాణలక్ష్మికి 50% అదనంగా నిధులు
  • గత ఏడాది కంటే 700 కోట్లు ఎక్కువ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కల్యాణలక్ష్మి పథకానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది కంటే 50 శాతం అదనంగా నిధులు కేటాయించారు. దీంతో అదనంగా 70 వేల మందికి లబ్ధి చేకూరనున్నది.  ఈ పథకానికి గత ఏడాది రూ.1,540 కోట్లు కేటాయించగా... ఈసారి బడ్జెట్లో రూ. 2,240కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది కంటే రూ.700కోట్లు అదనంగా కేటాయించారు.  పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆడపిల్లల పెండ్లిళ్లు చేసేందుకు ఇబ్బంది పడుతుండటంతో సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి , షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాల కింద రూ.51వేల ఆర్థిక సాయం చేసేవారు.  2017లో రూ. 75,116కు, 2018లో రూ.1,00,116కు పెంచారు


logo
>>>>>>