శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 02:35:06

శాంతించిన కృష్ణమ్మ

శాంతించిన కృష్ణమ్మ

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: కృష్ణమ్మ జోరు కాస్త తగ్గింది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వరద కొనసాగుతున్నది. మంగళవారం జూరాల ప్రాజెక్టు 10 గేట్ల ద్వారా దిగువకు 70,580 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1.24 లక్షల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,02,682 క్యూసెక్కులుగా నమోదైంది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 38,922 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 38,922 క్యూసెక్కులు, నారాయణపురకు ఇన్‌ఫ్లో 54,687 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 42,213 క్యూసెక్కులుగా నమోదైంది. తుంగభద్ర జలాశయానికి వరద నిలకడగా కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి 2,45,648 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,66,248 క్యూసెక్కులు, 1,93,776 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో 1,12,882 క్యూసెక్కులు, 92,132 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీకి 69,313 క్యూసెక్కుల వరద వస్తుండగా, 63,313 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూర్‌ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. మంగళవారం సాయంత్రం 4749 క్యూసెక్కుల వరద రాగా, ప్రాజెక్టు నీటి మట్టం 24.500 టీఎంసీలకు చేరుకున్నది.logo