శనివారం 11 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 10:47:34

ఉమ్మడి మెదక్ జిల్లాను హరిత వనంగా మార్చాలి : మంత్రి హరీశ్‌రావు

ఉమ్మడి మెదక్ జిల్లాను హరిత వనంగా మార్చాలి : మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి : ఉమ్మడి మెదక్ జిల్లాను హరిత వనంగా మార్చాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపు నిచ్చారు. పటాన్ చెరు శివారు ఈద్గా లో మంత్రి  ప్రార్థనలు చేశారు. అనంతరం మొదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. భవిష్యత్ తరాలకు మనమే పచ్చదనాన్ని అందించాలని సూచించారు. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. ఊరూరా విరివిగా మొక్కలు నాటాలని మంత్రి కోరారు.


logo