గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 01, 2021 , 02:31:54

స్ఫూర్తిని రగిలిస్తున్న గ్రీన్‌ చాలెంజ్‌

స్ఫూర్తిని రగిలిస్తున్న గ్రీన్‌ చాలెంజ్‌

  • ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (నమస్తే తెలంగాణ):  గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌.. మొక్కలు నాటాలనే స్ఫూర్తిని రగిలిస్తున్నదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం ద్వారానే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించగలుగుతామని చెప్పారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఎంపీ సంతోష్‌కుమార్‌ రూపొందించిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ప్రభాకర్‌రావుకు ఆ సంస్థ కో ఫౌండర్‌ రాఘవ గురువారం అందజేశారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ రాష్ట్రంలోని ప్రకృతి చిత్రాలతో ప్రత్యేకంగా రూపొందించిన వృక్షవేదం పుస్తకం అద్భుతంగా ఉన్నదని ప్రభాకర్‌రావు కితాబిచ్చారు.


logo