సోమవారం 01 మార్చి 2021
Telangana - Jan 24, 2021 , 02:18:12

ఆడబిడ్డల్లో తెలంగాణ అగ్రస్థానం

ఆడబిడ్డల్లో తెలంగాణ అగ్రస్థానం

  • రాష్ట్రంలో పెరుగుతున్న బాలికల సంఖ్య 
  • జాతీయ సగటు 963తో పోల్చితే టాప్‌ నేడు జాతీయ బాలికా దినోత్సవం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, జనవరి 23(నమస్తే తెలంగాణ): అనాదిగా భారతీయ సమాజంలో స్త్రీకి తక్కువ ప్రాముఖ్యత, పురుషుడికి ఉన్నత స్థానం ఏర్పడింది. ఇప్పుడు క్రమంగా ఆ తారతమ్యం చెరిగిపోతున్నది. ఆడబిడ్డకు ఆదరణకు పెరుగుతున్నది. అందులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతుండడం గర్వకారణం.

రాష్ట్రంలో ప్రతి 1000 మందికి 1049 మంది బాలికలు ఉండటం విశేషం. అందులో పట్టణ ప్రాంతంలో 1015 మంది కాగా, గ్రామీణ ప్రాంతంలో అధికంగా 1070 మంది బాలికలు ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఇక దేశవ్యాప్తంగా 2015-16లో ప్రతి వెయ్యి మంది బాలురకు 977 మంది బాలికలు ఉండగా, 2019-20లో వారి సంఖ్య 963కు పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో 929 మంది బాలికలు ఉండగా, పట్టణాల్లో 1023మంది ఉన్నారు. 

అదీగాక ఆడబిడ్డల విద్య, వైద్యం, భద్రత సహా అన్ని రంగాల్లోనూ టీఎస్‌ సర్కారు పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు దూసుకుపోతున్నారు. కాగా, బాలికలపై వివక్ష నిర్మూలించేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ ఏటా జనవరి 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను చేపడతున్నారు. అదేవిధంగా బాలిక విద్య, రక్షణ, పోషణ, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. 

VIDEOS

logo