శనివారం 11 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 12:35:03

హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి: మంత్రి పువ్వాడ

హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి: మంత్రి పువ్వాడ

ఖమ్మం : ఆరో విడ‌త తెలంగాణ‌కు హ‌రితహారం కార్యక్రమంలో లక్ష్యాన్ని పూర్తి చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. హ‌రితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలోని లకారం మినీ ట్యాంక్ బండ్ పై వెయ్యి మొక్కలు, వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ రేంజ్ పార్కులో 117 ఎకరాల్లో 57,700 మొక్కలను నాటే కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో తెలంగాణ దేశానికి ఆద‌ర్శంగా నిలుస్తుందన్నారు.

సీఎం కేసీఆర్ అద్భుత ఆలోచ‌న‌లోంచి పుట్టిందే ఈ హ‌రితహారం కార్యక్రమం అన్నారు. గ‌త ఐదు విడ‌త‌ల‌కు భిన్నంగా ఈసారి ఆరో విడ‌త తెలంగాణ‌కు హ‌రితహారాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు అధికారులకు ఇప్పటికే సూచించడమైందన్నారు. ప‌ర్యావ‌ర‌ణానికి, జీవ వైవిధ్యానికి, వాతావ‌ర‌ణ స‌మతౌల్యానికి హ‌రితహారం దోహ‌ద‌ప‌డుతుందని, అందుకే ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మంత్రి కోరారు.


logo